Monday, May 14, 2018

Weight loss own experience


What eating is  matter   -  what body system doing is  very important


My age         - 38 years.
Weight         - 197 lbs evening   and 195 in mornings.
current BMI    -  30.1 ( FALLING into Obsess).
Target BMI     -  24.9/25


If the same weight continues -  soon in another year I may fall into generation loving diseases :

1)  Bloop Pressure.
2)  Diabetis.
3)  Joint pains or Arthritis.
4)  Kidney problems.
5)  Fatty liver problems.
6)  Don't know - what I come to know as per seeing life of my 
    colleague.


OVER WEIGHT IS THE ONLY CAUSE FOR ALL HEALTH ISSUES/DISEASES. 

 So,  let me set my goal starting today - 05/14/2018.

So far my life style of having food habits as below (I can say that I addicted for items I can't point my wife is the reason for my weight increasing as her cooking is awesome on different varieties).


1st goal -  5 lbs :

Plan : Week 1


https://www.quora.com/Why-is-it-always-hard-to-lose-the-first-5-pounds-of-weight





Tips for Skin and Hair care


Hair Tips :


జుట్టు ఎదుగుదలలో  విటమిన్లూ, ప్రొటీన్లూ కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బీ  కాంప్లెక్స్విటమిన్లోపించకుండా చూసుకోవాలి.
గుడ్డూ బాదం, వేరుసెనగ, అరటి పండు, క్యారెట్లూ, పాల ఉత్పత్తులూ, సెరెల్స్‌, తృణధాన్యాలు, మొలకలూ తింటే విటమిన్, ప్రొటీన్లు చేరతాయి.

కానీ కాలంలో జంక్ఫుడ్‌, చక్కెర్లూ, ప్రాసెస్డ్ఫుడ్తీసుకోవడం వల్ల జీర్ణం సరిగా అవ్వదు. ప్రక్రియ కూడా జుట్టు ఎదుగుదల్లో కీలకపాత్ర పోషిస్తుంది. బాగా అరుగుదల ఉండి.. జీర్ణవ్యవస్థ పనిచేస్తే ప్రభావం జుట్టు ఎదుగుదలపై పడుతుంది.
అలానే సమయానికి ఆహారం తీసుకోవాలి.
నిద్రకు వేళలు పాటించాలి.
చుండ్రూ, జిడ్డు లేకుండా ఎప్పటికప్పుడు మాడును శుభ్రంగా ఉంచుకోవాలి.

నూనెలతో వారానికోసారి మర్దన చేసుకోవాలి. ఆహారం పరంగా మార్పులు చేసుకున్నా జుట్టు రాలుతోంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించాలి. పలు అనారోగ్యాల కారణాల వల్లా జుట్టు రాలిపోతుంది. త్వరగా గుర్తిస్తే ఇబ్బందులు తొలగించుకోవడం వందశాతం సాధ్యమవుతుంది.


 SKIN   Tips :

 నుంచి అందుతాయివి... 
ఆహారం ద్వారా అందే ప్రొటీన్‌ చర్మం సాగకుండా దృఢంగానూ, మృదువుగానూ ఉంచుతుంది. అందుకే గుడ్లు తీసుకోవాలి. ఇది చక్కని సమతులాహారం. చర్మానికి మేలు చేసే ప్రొటీన్‌, బయోటిన్‌ దీన్నుంచి సమృద్ధిగా అందుతాయి. పచ్చ సొనలో విటమిన్‌ బి, ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటితోపాటు తప్పనిసరిగా ఆకుకూరలూ, ముదురు రంగు కాయగూరలు ఉండేలా చూసుకోవాలి. అలానే నారింజ, పాలకూర వంటి వాటిల్లో విటమిన్లూ, బీటాకెరొటిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలానే విటమిన్‌ సి ఉన్న ఆహారం జామ, పుచ్చకాయలూ, బెర్రీలు తీసుకోవాలి. ఇది చర్మం నిగారింపుగా కనిపించేలా చేస్తుంది. బాదం, వేరు సెనగలూ, తృణధాన్యాల మొలకలూ వంటివాటిల్లో విటమిన్‌ ఇ తో పాటు యాంటీఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. 
అలానే పొట్టుతో ఉన్న పప్పులూ, చిరుధాన్యాలకీ ప్రాధాన్యమిస్తే చర్మానికి కావలసిన ఎసెన్షియల్‌ ఫ్యాట్లూ అందుతాయి. ఈ విటమిన్లలో ఏది లోపించినా సరే! చర్మం నిర్జీవంగా మారడం, చర్మసంబంధిత సమస్యలు దరిచేరడం జరుగుతాయి.
అదనంగా... 
వీటితోపాటు మంచినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది. ముఖానికి సంబంధించిన కొన్ని యోగసనాలుంటాయి. ఇవీ చర్మాన్ని బిగుతుగా,  ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి. ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. ఎండలోకి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌కి తప్పని సరిగా ప్రాధాన్యమివ్వాలి. ఆహారంతోపాటు తగిన నియమాలూ పాటిస్తేనే చర్మం చక్కగా ఆరోగ్యంగా మెరిసిపోతుంది.
ఈ నియమాలు తప్పనిసరి.. 
చర్మానికి కొన్ని రకాల ఆహారపదార్థాలు సరిపడవు. వాటివల్ల పలు సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా రిఫైండ్‌ ఉత్పత్తులూ, పాసెస్డ్‌ఫుడ్‌, మైదా, చక్కెరా, కొవ్వులూ, బేకరీ పదార్థాలూ, వనస్పతీ, శాచ్యురేటెడ్‌ ఫ్యాట్లూ, కాఫీ, టీల వంటివి తీసుకోకూడదు. ఇవి చర్మాన్ని కాంతివిహీనంగా మార్చేస్తాయి. చిన్నతనంలోనే వృద్ధాప్య ఛాయలు కనిపించే అవకాశమూ ఉంటుంది. 
* చాలామంది పాల పదార్థాలు చర్మానికి మంచిదికాదు అనుకుంటారు. అందులో కొంత మాత్రమే వాస్తవముంది. కొవ్వు తీసిన పాల వల్ల ఇబ్బంది ఉండదు. కొవ్వు ఉన్నప్పుడే సమస్య. అందుకే చీజ్‌, పనీర్‌.. ఇలా బయట లభించే వాటిని దూరం పెట్టాలి. అలాగని పాలపదార్థాలను మానేస్తే క్యాల్షియం, ప్రొటీన్‌ లోపం వస్తుంది. అందుకే కొవ్వు తీసిన పాలూ లేదా స్కిమ్మ్‌డ్‌ మిల్క్‌ వాడొచ్చు. మరి శరీరానికి ఫ్యాట్‌ అవసరం లేదా అనుకుంటారేమో! అవసరమే.. రోజుకు ముప్ఫై ఎమ్‌ఎల్‌ సరిపోతుంది. కూరల్లో రోజూ వాడే నూనె, వెన్న, నెయ్యి రూపంలో అందుతుంది. అంతకు మించితేనే మంచిది కాదు.

Friday, May 11, 2018

Heart Attack or Stroke - or Cardiac arrest - Why, How to avoid




                                             హార్ట్ ఎటాక్
గుండె (హార్ట్ ) శరీరంలో ప్రధాన అవయవము . ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్తనాళాల ద్వారా  రక్తాన్ని, సరఫరా  చేస్తుంది . వీటిలో ప్రధానమైనది కరోనరీ ధమని (ఆర్టరీ). ఇవి గుండెకి ,శరీరంలోని ఇతరభాగాలకు  రక్తాన్ని ,ఆక్సిజన్ ని సరఫరా చేస్తాయి. ఏదయినా  కారణం వల్ల దమనులలో అడ్డంకులు ఏర్పడి హఠాత్తుగా  గుండెకి అందవలిసిన రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోతే  హార్ట్ ఎటాక్ వస్తుంది .
రక్తనాళాల్లో ముఖ్యంగా దమనులలో కొవ్వుపదార్దాలు పేరుకుపోవడం వలన వీటి అంతర్గత పరిమాణం తగ్గిపోయి రక్తపంపిణీలో తగ్గుదల ఏర్పడుతుంది . ఈ అడ్డంకులు కూడా అకస్మాత్తుగా ఏర్పడడం వలన రక్త పంపిణి ఒక్కసారిగా ఆగిపోతుంది . ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుంది .

ఒకప్పుడు 60 సంవత్సరాలు పై బడిన వారిలో కనపడే ఈ వ్యాధి ఇప్పుడు 30 దాటినా వారిలోను  కనపడుతుంది. అయితే చిన్నారులలో కూడా గుండె సంబంధిత వ్యాధుల సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది . భారత దేశంలో ఒక శాతం మంది పిల్లలు (ప్రతి 125 పిల్లలో ఒకరు )పుట్టుకతోనే గుండె లోపాలతో జన్మిస్తున్నారు .సాధారణంగా వీరిని బ్లూ బేబీస్ గా పిలుస్తారు .   ఒకానొక సమయంలో దీనికి  ఎలాంటి చికిత్స లేదు . కానీ ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన పురోగతి వలన  గుండె సంబంధిత వ్యాధి బారిన పడుతున్న చాలామంది పిల్లలకు సకాలంలో శస్త్రచికిత్స చేయడం వలన వారు సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు .

హార్ట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం . సాధారణంగా  హార్ట్ లో ఫోర్ చాంబర్స్ ఉంటాయి రైట్ సైడ్ చాంబర్స్ బ్లడ్ ని బాడీ నుండి చేసి లంగ్స్ కి పంపిస్తాయి అలానే లంగ్స్ నుండి మనం పీల్చుకున్న ఆక్సిజన్ ని తీసుకుంటాయి . లెఫ్ట్ సైడ్ వి ఫ్రెష్ బ్లడ్ ని లంగ్స్ నుండి వెనకకి తీసుకుని మిగతా శరీర భాగాలకు పంపుతాయి .  ధమనులు హార్ట్ నుండి రక్తాన్ని గుండె నుండి రక్తాన్ని మిగతా శరీర బాగాలకి పంపుతాయి . సిరలు బ్లడ్ ని హార్ట్ కు పంపుతాయి . లంగ్స్ నుండి వచ్చే బ్లడ్ ఆక్సిజన్ తో నిండి ఉంటుంది . దీన్ని రెడ్ బ్లడ్ అని అంటారు . ఈ బ్లడ్ చాల నిండు రెడ్ కలర్ లో ఉంటుంది . శరీర భాగాల నుండి తిరిగి హార్ట్ కు వెళ్లే బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి . ఈ బ్లడ్ ని బ్లూ బ్లడ్ అంటారు . హార్ట్ వాల్స్ రెడ్ ,బ్లూ  బ్లడ్ ని సెపరేట్ గ ఉంచుతాయి . హార్ట్ వాల్వ్స్ బ్లడ్ ని రైట్ డైరెక్షన్ లో ఫ్లో అయ్యేట్టు చూస్తాయి .

ఒక్కోసారి హార్ట్ వాల్స్(కవాటాలు) లో (హార్ట్ లో హోల్ ) లేక హార్ట్ వాల్వ్స్(సన్నగా ఉండడం లేదా కంప్లేటేగా బ్లాక్ అవడం )లో ప్రాబ్లెమ్ .దీని అర్ధం రెడ్ ,బ్లూ బ్లడ్ లు మిక్స్ అవ్వడం లేక హార్ట్ సరిగా బ్లడ్ ని పంప్ చేయకపోవడం వలన శరీరం తగినంత ఆక్సిజన్ ని గ్రహించలేదు . పిల్లలో వచ్చే ఈ వ్యాధులని లక్షణాలతో గుర్తించలేము అలాంటి సందర్భాలలో  పిల్లల డాక్టర్ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో రోగ నిర్దారణ చేయవొచ్చు . తల్లితండ్రులు తప్పక ఈ క్రింది సంకేతాలను గమనించాల్సి ఉంటుంది . ఏవి గుండె సంబంధిత సమస్య లక్షణాలను సూచించవచ్చు .

పాలు త్రాగడంలో ఇబ్బంది పడడం చెమటలు ఎక్కువగా పడటం శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పెదవులు ,వేళ్ళు మరియు కాలి వేళ్ళు నీలం రంగులోకి మారడం గ్రోత్ సరిగా లేకపోవడంతరచుగా చాతీ భాగాలలో ఇన్ఫెక్షన్ రావడం రుమాటిక్ హార్ట్ డిసీజెస్ (ఆర్జిత గుండె వ్యాధి)
రుమాటిక్ గుండె వ్యాధులు పాఠశాలకు వెళుతున్న పిల్లలలో సర్వసాధారణం మరియు స్ట్రెప్టోకాకస్ అనే బాక్టీరియా వలన స్ట్రెప్ గొంతు ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందవచ్చు.
స్ట్రెప్టోకోకై బాక్టీరియా గుండె కండరాలను పోలినటువంటి ఒక జన్యు పరమైన ఆకృతిని కలిగి ఉంటుంది. కాబట్టి, శరీరపు రక్షణ విధానం బాక్టీరియాకు మరియు గుండె కండరాలకు మధ్య విబేధాలను గుర్తించలేదు మరియు ఒకదానికి బదులుగా మరోదానిపై దాడులు చేస్తుంది. ఇది ముఖ్యంగా గుండె కవాటాలు మరియు గుండె కండరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు దీనివల్ల నిర్వహణ పేలవం చెందవచ్చు.
భారతదేశంలో, రుమాటిక్ జ్వరం విలక్షణ స్థాయిలో సంభవిస్తుంది తద్వారా హృద్రోగాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారిపోయింది, దాదాపు 25-45% వరకు ఈ గుండెజబ్బులు పరిగణనలోకి తీసుకోవచ్చు. రుమాటిక్ జ్వరం యొక్క సాంవత్సరిక సంభావ్యతను అభివృద్ది చెందిన దేశాలలో గమనించినట్లయితే 100-200 రెట్లు కంటే అధికంగా ఉంది మరియు 1,00,000 పాఠశాల వయస్సు పిల్లలలో 100-200 చొప్పున (5 సంవత్సరాల నుంచి 17 లేదా 18 సంవత్సరాలు) హెచ్చుతగ్గులలో దీని బారిన గురవుతున్నారు.

పూర్తిగా ఆరోగ్యంగా వున్న పిల్లల పై వ్యాధి ప్రభావాన్ని, తల్లిదండ్రులు ఎల్లప్పుడూ దగ్గు, జ్వరం వుండి కూడా తుమ్ములు రాని పిల్లలను ఎప్పుడూ కూడా అస్సలు పట్టించుకోకుండా ఉండకూడదు అని  సిఫారసు చేయబడుతుంది. రుమాటిక్ గుండె వ్యాధి యొక్క సాధారణ లక్షణాలు కీళ్ల మంటలు సహా - వాపు, సున్నితత్వం, మరియు బహుళ కీళ్ళ చుట్టూ ఎరుపు బారటం, చిన్న లేదా కఠినమైన కణితులు, చర్మం క్రింద గుండ్రటి గడ్డలు ఏర్పడటం, పిల్లల న్యూరో మస్కులర్ కదలికల్లో మార్పులు, శరీరం పై దద్దుర్లు, జ్వరం, అసాధారణ బరువు క్షీణత, ఆయాసం మరియు తరచుగా కడుపులో నొప్పి. ఇవి అన్ని లక్షణాలు వైరల్ జ్వరంతో మిళితమై కూడా ఏర్పడవచ్చు, అది స్ట్రెప్ గొంతు ఇన్ఫెక్షన్ మరియు రుమాటిక్ గుండె వ్యాధో తెలుసుకోవడానికి వైద్యున్ని ఆశ్రయించడం ఉత్తమం.

ఈ వ్యాధి బారిన పడిన పిల్లలకు కవాటాన్ని మార్చే అవసరం ఏర్పడవచ్చు, దీనిని సరైన సమయంలో చేయకపోతే కూడా ప్రాణాంతకంగా మారవచ్చు. గుండె జబ్బుల కారణంగా పిల్లల మరణాలను అరికట్టడం అవసరం. జన్మసిద్ధ గుండె వ్యాధి మరియు రుమాటిక్ గుండె వ్యాధి ఉన్న పిల్లలు, ముఖ్యంగా సంక్లిష్ట జన్మసిద్ధ గుండె వ్యాధులు కలిగి ఉన్న పిల్లలు అధిక సంఖ్యలో మరణిస్తున్నారు, ఎందుకంటే దేశంలో సరైన ఆపరేటివ్ సౌకర్యాల లభ్యత లేమి. అంతేకాకుండా ఇది సాధారణంగా ఖరీదైన శస్త్రచికిత్స కావున తల్లిదండ్రుల నిధుల లేమితో అనారోగ్యమును విస్మరించేలా చేస్తుంది మరియు వారి పిల్లల తల వ్రాత ఇంతే అని అంగీకరించుకుంటున్నారు.

పెద్దవాళ్లలో హార్ట్ ఎటాక్  లక్షణాలు
1. గుండెకు రక్తం అందించే రక్తనాళాల లోపల గోడలకు కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ తగ్గుతుంది. గుండెకండరానికి రక్తం సరఫరా తగ్గి నొప్పి మొదలవుతుంది. గుండె అసౌకర్యంగా ఉండి..నొప్పి క్రమేపి ఎడమ చేతికి, కొన్ని సార్లు కుడిచేతికి , గొంతు, దవడలు, నడుము, ఉదరం ఇలా వివిధ భాగాలకు విస్తరిస్తుంది. 2. వాంతులతో లేదా వాంతి కాకుండా అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి.
2. ఉన్నట్టుండి ముఖంలో ఒక్కసారిగా నీరసం కనిపించడం. కాళ్లు, చేతుల్లో, ముఖ్యంగా ఛాతికి పక్కభాగాన అప్పటికప్పుడే నొప్పిగానూ, నీరసంగానూ అనిపించడం.
 3. శ్వాస కష్టమవుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అయోమయానికి గురికావటం, మాట్లాడంలో తికమక పడటం, అర్థం చేసుకోవడంలోనూ చిన్న విషయానికి కూడా అయోమయం పడటం.
 4. ఉన్నట్టుండి కళ్లలో ఏదో ఒకటి లేదా రెండూ చూడలేకపోవటం, కళ్లు బైర్లు కమ్మినట్టుగా ఉండటం. శరీరమంతా చెమటలు పట్టడం జరుగుతుంది. 5. ఒక్కసారిగా నడవటానికి ఇబ్బంది పడటం, నిస్సత్తువగా, భరించలేనంత నీరసంగా అనిపించటం, నడిచే క్రమంలో తూలుతున్నట్లుగా ఉండటం, అడుగుతీసి వేసే క్రమంలో బ్యాలెన్స్ చేయలేకపోవటం వంటివి. ఇవన్నీ గుండెనొప్పికి సూచనలే.

ఎలా తగ్గించుకోవాలి

సరైన ఆహారపు అలవాట్లు
చాల వరకు, అన్ని రకాల  అనారోగ్యాలకు ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటిని మార్చుకోవడం ద్వారా కొన్ని వ్యాదులను దూరంగా ఉంచువచ్చు. హార్ట్ ఎటాక్ కూడా దీంట్లో ఒక్కటి. పౌష్టికాహారం తో కూడిన మీల్స్ మరియు స్నాక్స్ తినడం మరియు తాజా పండ్లు, కూరగాయలను డైట్ లో భాగం చేసుకోవడం ద్వార గుండె ను ఆరోగ్యంగా చేసుకోవచ్చు.  ఇంకా సాచురేటేడ్ ఫాట్స్, కొలెస్టరాల్  తక్కువగా ఉన్న పదార్థాలు మరియు ఫైబర్ ఎకువగా ఉన్న పదార్థాలు కొలెస్టరాల్ లెవెల్స్ ని అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని భద్ర పరుస్తాయి.

బరువు ను అదుపులో ఉంచుకోవడం
అధిక బరువు గుండె పై ప్రభావాన్ని చూఫై, స్ట్రోక్ రావడానికి ఉన్న రిస్క్ ని పెంచుతుంది. వెయిట్ ని నిర్దారించాడానికి సరైన మార్గం BMI. ఇంకొక మార్గం ఏంటంటే హిప్ నడుము రేషియో కూడా. ఈ రెండింటిని తరచూ గమనిస్తూ ఉండండి. మార్పులను మార్క్ చేస్తూ అవసరమైన ఇంటర్వెన్షన్ ప్రక్రియలను చేపట్టండి.

స్మోకింగ్, ఆల్కహాల్ కు దూరంగా ఉండండం
పొగ త్రాగడం స్ట్రోక్ రిస్క్ ని  గణనీయంగా పెంచుతుంది. ఒక వేల మీరు పొగతాగే వారైతే మానేయండి, లేకపోతె ఎప్పుడు తాగకూడదని నిర్దారించుకోండి. అలాగే, మద్యాన్ని కూడా దూరంగా ఉంచండి. ఒక వేల తగాల్సి వచ్చినా, లిమిటెడ్ ఒక ఒకటి రెండు పెగ్ లకు మించి తీసుకోకండి, అది అకేషనల్ గ మాత్రమె.ఈ మార్పులతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని, స్ట్రోక్ ను ద్దోరంగా ఉంచవచ్చు.

గుండె ఆరోగ్యంలో వ్యాయామాల ప్రాముఖ్యత
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఆహారాలు మాత్రమేకాదు, వ్యాయామాలు కూడా చేయాలి. కేవలం 30 నిమిషాల పాటూ, ఎరోబిక్స్ వ్యాయామాలను చేయటం వలన లేదా 10 నుండి 15 నిమిషాలు సైకిల్ తొక్కటం వలన పూర్తీ ఆరోగ్యంతో పాటూ, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

వాకింగ్
మన చిన్న గుండెకు మేలు చేసే సులువైన మరియు మంచి ప్రభావితమైన వ్యాయామంగా వాకింగ్ ను పేర్కొనవచ్చు. ఈ సులువైన వ్యాయామం వలన గుండె ఆరోగ్యమే కాకుండా, పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మెట్లు ఎక్కటం
ఈ రకం వ్యాయామాన్ని భయట ఎక్కడో కాకుండా ఇంట్లోనే చేయవచ్చు. అంతేకాకుండా, ఎస్కులేటర్, లిఫ్ట్ వంటి వాటిని వాడకుండా మెట్లు ఎక్కటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా చేయటం వలన హృదయ స్పందన రేటు 50 నుండి 85 శాతం వరకు పెరుగుతుంది.

సైకిల్ తొక్కటం
మీరు సైకిల్ తొక్కటం వలన కాళ్ళలో జరిగే కదలికల వలన గుండె ద్వారా కాలిలో ఉండే ఉండే పొడవైన కండరానికి రక్తం సరఫరా చేయబడుతుంది. సైకిల్ ను భయట మాత్రమే కాదు, ఇంట్లో ఉండే స్థిర సైకిల్ (స్టేషనరీ సైక్లింగ్) లో కూడా తొక్కవచ్చు. వీటి వలన గుండె విధి పెరిగి, దాని ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

ఈత
గుండె ఆరోగ్యం ఎక్కువగా మెరుగుపడటానికి, స్విమ్మింగ్ పూల్ లో కనీసం 20 నుండి 30 నిమిషాల పాటూ ఈత కొట్టండి. ఇలా చేయటం వలన శరీరం తాజదననికి గురవటమేకాకుండా, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మందులు
జీవన శైలిలో మార్పులను అనుసరించటంతో గుండె వ్యాధులు తగ్గుతాయని అనుకోవటం తప్పే, మార్పులతో పాటుగా మందులను కూడా సమయానికి తీసుకోవాలి. గుండె వ్యాధులను తగ్గించుటలో మందులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని రకాల మందులు రక్త పీడనాన్ని లేదా హృదయస్పందనలో లోపాలను, రక్తంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తాయి, వీటిని రోజు వాడటం వలన గుండె వ్యాధులు తగ్గుతాయి. వైద్యుడి అనుమతి లేకుండా గుండె సంబంధిత వ్యాధులను తగ్గించే మందులను వాడకూడదు. ఈ మందులను వాడే సమయంలో ఇతర మందులను వాడటం వలన శరీరంలో దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.



-======================================================

గుండె మన గుప్పెడంతే ఉంటుంది. దాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా... స్పందించడం మానేస్తుంది. విచిత్రం ఏంటంటే... పురుషులతో పోలిస్తే మహిళలు గుండెను పెద్దగా పట్టించుకోరనేది వాస్తవం. అదే మనకు చేటు చేస్తోంది. ఉన్నట్టుండి సమస్యల్లోకి నెట్టేస్తోంది. అందుకే ఇకనుంచైనా హృదయాన్ని కాపాడుకుందాం. మనకూ మనసుంటుందని చాటి చెబుదాం.

ఒక కుటుంబ సంక్షేమం, భవిష్యత్తు... ఆ ఇంటి ఇల్లాలిపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఆమె ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. కానీ జ్వరమో, తలనొప్పో... మరేదైనా అనారోగ్యమో వస్తే చటుక్కున ఓ మాత్ర వేసుకుని పనిలో పడిపోతుంది. ఇక, గుండె ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యం అంతంతమాత్రమే. ఆ నిర్లక్ష్యమే...నివురుగప్పిన నిప్పులా ఆమెకు చిన్నవయసులోనే ముప్పు తెచ్చిపెడుతోంది. ‘నేను బాగానే ఉన్నాను కదా...’ అని సర్దిచెప్పుకోవడం, ఎప్పుడైనా డాక్టర్‌ దగ్గరకు వెళ్లినా... గుండె పరీక్ష చేయించుకునే అవకాశం వచ్చినా... తరువాత చూద్దాం అని వాయిదావేసే అలవాటు ప్రాణాలమీదకే తెస్తోంది. ఈ పరిస్థితి ఒక్క భారత్‌లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరి సమస్య. సాధారణంగా స్త్రీలలో ఉండే ఈస్ట్రోజెన్‌ హార్మోను గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ మెనోపాజ్‌ తరువాత ఆ హార్మోను విడుదల ఆగిపోతుంది. దాంతో పురుషులతో సమానంగా మహిళల్లోనూ గుండెకు సంబంధించి సమస్యలు మొదలవుతాయి. అయితే ఒకప్పటితో పోలిస్తే... ఇప్పుడు జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల మెనోపాజ్‌ కన్నా ముందే హృదయ సంబంధిత సమస్యలు మహిళల్లో కనిపిస్తున్నాయి.

సహజ కారణాలే కాదు...
సాధారణంగా స్త్రీ, పురుషులు ఎవరికైనా సరే... అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, స్థూలకాయం.. వంటివి గుండెకు హానిచేస్తాయి. ఇవి కాకుండా.. మెనోపాజ్‌తో పాటు ప్రత్యేకించి మరికొన్ని రిస్క్‌ఫ్యాక్టర్లు స్త్రీలలో గుండె సమస్యలు రావడానికి కారణం అవుతున్నాయి.
* మధుమేహం: పురుషులతో పోలిస్తే.. మహిళల్లో మధుమేహం ఉన్నప్పుడు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.  అంతేకాదు దీనివల్ల వల్ల మెనోపాజ్‌ కంటే ముందే ఈస్ట్రోజెన్‌ హార్మోను రక్షణ పోతుంది. దాంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది.
*ఒత్తిడి: ఈ సమస్య మహిళల్లో ఎక్కువ. కుంగుబాటు, ఒత్తిడి  నుంచి బయటపడటానికి తగిన చికిత్స తీసుకోరు. దాంతో ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని కొనసాగించలేరు. ఆ ప్రభావం గుండెపై పడుతుంది.
* చురుగ్గా లేకపోవడం: ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, శరీరానికి తగిన శ్రమ లేకపోవడం కూడా గుండె వ్యాధులకు ఓ కారణమే.
* గర్భధారణ: ఈ సమయంలో అధికరక్తపోటు ఉన్నా, మధుమేహం వచ్చినా, అంతకన్నా ముందే పీసీఓడీ సమస్య ఉన్నా... ఆ ప్రభావం భవిష్యత్తులో గుండె సమస్యలకు దారితీస్తుంది.
* వంశపారంపర్యం: కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నా... మహిళకు అది సమస్యగా మారొచ్చు.  వీటన్నింటివల్లా ఎక్కువగా అయితే గుండెపోటు ఎదురవుతుంది. రక్తనాళాల్లో కొవ్వు చేరి ఆ నాళం సన్నగా మారి, మూసుకుపోతుంది. కొన్నిసార్లు ఆ నాళాల్లో నెత్తురు గడ్డకట్టుకుని దమనులు మూసుకుపోతాయి. దాంతో హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది. అయితే మన దేశంలో మహిళల్లో వచ్చే గుండెజబ్బుల్ని కనుక్కోవడం చాలా కష్టం.

సంకేతాలు ఉంటాయా...
గుండెపోటుకి సంకేతాలు కనిపిస్తాయి కానీ... చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కొన్నిసార్లు అవేవీ కనిపించకపోయినా కూడా గుండెపోటు రావొచ్చు. అయితే కొన్ని లక్షణాలను బట్టి ఈ సమస్యను అంచనా వేయొచ్చు. అవేంటంటే ముఖ్యంగా మెడ, దవడ, ఎడమ భుజం, వీపు పై భాగం నొప్పిగా ఉండటం, పొట్టలో అసౌకర్యం, వికారం, వాంతి వచ్చినట్లుగా ఉండటం, ఆయాసం సహజం. అకారణంగా చెమట పట్టొచ్చు. అకారణంగా అలసట, కళ్లు తిరగడం వంటివీ ఎదురవుతాయి. ఛాతీభాగం పట్టేసినట్లుగా అనిపిస్తుంది. ఈ లక్షణాల ఆధారంగా  సమస్యను అంచనా వేస్తారు.
గుండెపోటు వచ్చాక ఆసుపత్రికి పరుగెత్తడం కన్నా ముందు నుంచీ నివారణా చర్యలపై దృష్టి పెట్టాలి.  కొన్ని రిస్క్‌ఫ్యాక్టర్లను గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండాలి.

  • ఆహారంలో మార్పులు అవసరం. ప్రాసెస్‌ చేసినవి, శీతలపానీయాలు వంటివాటికి దూరంగా ఉండాలి. సహజంగా లభించే పదార్థాలు ఎంచుకోవాలి. అంటే దంపుడుబియ్యం, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చేపలు, మొలకలు, నట్స్‌, కొవ్వులేని పదార్థాలు వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. చక్కెర, ఉప్పు శాతం తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి.

  • కనీసం గంటసేపు వ్యాయామం చేయాలి. మహిళలకు నడక మంచిది కాబట్టి.. రోజూ అరగంట నుంచి ముప్పావుగంట చొప్పున వారంలో ఐదురోజులు వేగంగా నడిచేలా చూసుకోవాలి. స్థూలకాయం సమస్యను అదుపులో ఉంచాలి. రోజంతా వ్యాయామం చేసే అవకాశం లేకపోతే... రోజులో సమయాన్ని విభజించుకుని వ్యాయామం చేయొచ్చు. జీవనవిధానం చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇంటిపనులు చేసుకోవడం, మెట్లెక్కి దిగడం, ఎక్కువసేపు కూర్చోకపోవడం వంటివి చేయాలి. ఇవన్నీ మీ గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  •  గర్భధారణ సమయంలో అధికరక్తపోటు, మధుమేహం, అంతకన్నా ముందే వచ్చిన పీసీఓడీ ఉన్నవారు... వైద్యులు చెప్పిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆ తరువాత కూడా ఆ సమస్యల్ని అదుపులో ఉంచుకోవాలి.
    * కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉంటే... ముప్ఫైఏళ్లు దాటాక ప్రతి రెండుమూడేళ్లకోసారి కొలెస్ట్రాల్‌తో పాటు బీపీ, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. నెలసరి ఆగిపోయాక కూడా కొలెస్ట్రాల్‌ పరీక్ష తప్పనిసరి. ఒకవేళ ఆ సమస్య ఉంటే గనుక వైద్యులు మందులు సూచిస్తారు. పదేళ్లలోపు నుంచే కొలెస్ట్రాల్‌ నిల్వలు మొదలవుతాయి..

source -