Monday, May 14, 2018

Tips for Skin and Hair care


Hair Tips :


జుట్టు ఎదుగుదలలో  విటమిన్లూ, ప్రొటీన్లూ కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బీ  కాంప్లెక్స్విటమిన్లోపించకుండా చూసుకోవాలి.
గుడ్డూ బాదం, వేరుసెనగ, అరటి పండు, క్యారెట్లూ, పాల ఉత్పత్తులూ, సెరెల్స్‌, తృణధాన్యాలు, మొలకలూ తింటే విటమిన్, ప్రొటీన్లు చేరతాయి.

కానీ కాలంలో జంక్ఫుడ్‌, చక్కెర్లూ, ప్రాసెస్డ్ఫుడ్తీసుకోవడం వల్ల జీర్ణం సరిగా అవ్వదు. ప్రక్రియ కూడా జుట్టు ఎదుగుదల్లో కీలకపాత్ర పోషిస్తుంది. బాగా అరుగుదల ఉండి.. జీర్ణవ్యవస్థ పనిచేస్తే ప్రభావం జుట్టు ఎదుగుదలపై పడుతుంది.
అలానే సమయానికి ఆహారం తీసుకోవాలి.
నిద్రకు వేళలు పాటించాలి.
చుండ్రూ, జిడ్డు లేకుండా ఎప్పటికప్పుడు మాడును శుభ్రంగా ఉంచుకోవాలి.

నూనెలతో వారానికోసారి మర్దన చేసుకోవాలి. ఆహారం పరంగా మార్పులు చేసుకున్నా జుట్టు రాలుతోంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించాలి. పలు అనారోగ్యాల కారణాల వల్లా జుట్టు రాలిపోతుంది. త్వరగా గుర్తిస్తే ఇబ్బందులు తొలగించుకోవడం వందశాతం సాధ్యమవుతుంది.


 SKIN   Tips :

 నుంచి అందుతాయివి... 
ఆహారం ద్వారా అందే ప్రొటీన్‌ చర్మం సాగకుండా దృఢంగానూ, మృదువుగానూ ఉంచుతుంది. అందుకే గుడ్లు తీసుకోవాలి. ఇది చక్కని సమతులాహారం. చర్మానికి మేలు చేసే ప్రొటీన్‌, బయోటిన్‌ దీన్నుంచి సమృద్ధిగా అందుతాయి. పచ్చ సొనలో విటమిన్‌ బి, ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటితోపాటు తప్పనిసరిగా ఆకుకూరలూ, ముదురు రంగు కాయగూరలు ఉండేలా చూసుకోవాలి. అలానే నారింజ, పాలకూర వంటి వాటిల్లో విటమిన్లూ, బీటాకెరొటిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలానే విటమిన్‌ సి ఉన్న ఆహారం జామ, పుచ్చకాయలూ, బెర్రీలు తీసుకోవాలి. ఇది చర్మం నిగారింపుగా కనిపించేలా చేస్తుంది. బాదం, వేరు సెనగలూ, తృణధాన్యాల మొలకలూ వంటివాటిల్లో విటమిన్‌ ఇ తో పాటు యాంటీఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. 
అలానే పొట్టుతో ఉన్న పప్పులూ, చిరుధాన్యాలకీ ప్రాధాన్యమిస్తే చర్మానికి కావలసిన ఎసెన్షియల్‌ ఫ్యాట్లూ అందుతాయి. ఈ విటమిన్లలో ఏది లోపించినా సరే! చర్మం నిర్జీవంగా మారడం, చర్మసంబంధిత సమస్యలు దరిచేరడం జరుగుతాయి.
అదనంగా... 
వీటితోపాటు మంచినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది. ముఖానికి సంబంధించిన కొన్ని యోగసనాలుంటాయి. ఇవీ చర్మాన్ని బిగుతుగా,  ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి. ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. ఎండలోకి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌కి తప్పని సరిగా ప్రాధాన్యమివ్వాలి. ఆహారంతోపాటు తగిన నియమాలూ పాటిస్తేనే చర్మం చక్కగా ఆరోగ్యంగా మెరిసిపోతుంది.
ఈ నియమాలు తప్పనిసరి.. 
చర్మానికి కొన్ని రకాల ఆహారపదార్థాలు సరిపడవు. వాటివల్ల పలు సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా రిఫైండ్‌ ఉత్పత్తులూ, పాసెస్డ్‌ఫుడ్‌, మైదా, చక్కెరా, కొవ్వులూ, బేకరీ పదార్థాలూ, వనస్పతీ, శాచ్యురేటెడ్‌ ఫ్యాట్లూ, కాఫీ, టీల వంటివి తీసుకోకూడదు. ఇవి చర్మాన్ని కాంతివిహీనంగా మార్చేస్తాయి. చిన్నతనంలోనే వృద్ధాప్య ఛాయలు కనిపించే అవకాశమూ ఉంటుంది. 
* చాలామంది పాల పదార్థాలు చర్మానికి మంచిదికాదు అనుకుంటారు. అందులో కొంత మాత్రమే వాస్తవముంది. కొవ్వు తీసిన పాల వల్ల ఇబ్బంది ఉండదు. కొవ్వు ఉన్నప్పుడే సమస్య. అందుకే చీజ్‌, పనీర్‌.. ఇలా బయట లభించే వాటిని దూరం పెట్టాలి. అలాగని పాలపదార్థాలను మానేస్తే క్యాల్షియం, ప్రొటీన్‌ లోపం వస్తుంది. అందుకే కొవ్వు తీసిన పాలూ లేదా స్కిమ్మ్‌డ్‌ మిల్క్‌ వాడొచ్చు. మరి శరీరానికి ఫ్యాట్‌ అవసరం లేదా అనుకుంటారేమో! అవసరమే.. రోజుకు ముప్ఫై ఎమ్‌ఎల్‌ సరిపోతుంది. కూరల్లో రోజూ వాడే నూనె, వెన్న, నెయ్యి రూపంలో అందుతుంది. అంతకు మించితేనే మంచిది కాదు.

No comments:

Post a Comment